రికార్డులు బద్దలుకొడుతున్న నాని సినిమా

రికార్డులు బద్దలుకొడుతున్న నాని సినిమా
x
Highlights

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ లకు అందుకున్న నాని 'జెర్సీ' సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. స్పోర్ట్స్ డ్రామాగా 'మళ్ళీరావా'...

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ లకు అందుకున్న నాని 'జెర్సీ' సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. స్పోర్ట్స్ డ్రామాగా 'మళ్ళీరావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. లాంగ్ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్ల కు మరింత దోహదపడిందని చెప్పుకోవాలి. భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం నాని కెరీర్లోనే 4వ హైయెస్ట్ ఓపెనింగ్ సినిమా గా మారింది. కేవలం తెలుగు రాష్ట్రంలోనే ఈ చిత్రం 4.47 కోట్ల వసూళ్లను నమోదు చేసుకోవడం విశేషం. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించారు. సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా కు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.

ఏరియావైజ్ 'జెర్సీ' డే 1 కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నిజం + యూఏ: 2.44 Cr

సీడెడ్: 0.40. Cr

గుంటూరు: 0.41 Cr

ఈస్ట్: 0.42 Cr

వెస్ట్: 0.29 Cr

కృష్ణ: 0.34 Cr

నెల్లూరు: 0.17 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.5 Cr

ఏపీ+తెలంగాణ: 4.47 Cr

Show Full Article
Print Article
Next Story
More Stories