రజనీకాంత్ కోసం రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి

* రజినీకాంత్ సినిమాలో నటించిన రాజశేఖర్

Dhatripriya
Updated on: 2 March 2023 3:00 PM IST
Jeevitha Rajasekhar Will Make A Re Entry For Rajinikanth
X

రజనీకాంత్ కోసం రీ ఎంట్రీ ఇవ్వనున్న సీనియర్ నటి 

Jeevitha Rajasekhar: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం "జైలర్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా రజినీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జయింట్ మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం "లాల్ సలామ్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. విష్ణు విశాల్ మరియు విక్రాంత్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తుండగా, రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ఇప్పుడు ప్రేక్షకులలో మరింత బజ్ ను క్రియేట్ చేసింది.

ఒకప్పటి హీరోయిన్ అయిన జీవిత రాజశేఖర్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది. మార్చి 7నుంచి చెన్నైలో జరిగే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్లో జీవిత రాజశేఖర్ కూడా పాల్గొనబోతున్నారట. గత కొంతకాలంగా జీవిత రాజశేఖర్ సినిమాలకి దూరంగా ఉంటున్నారు. భర్త రాజశేఖర్ నటిస్తున్న సినిమాలు నిర్మిస్తూ తెర వెనకే ఉండిపోయిన జీవిత మళ్లీ ఇన్నాళ్ళకి రజినీకాంత్ సినిమా కోసం మేకప్ వేసుకోడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ కు చెల్లెలు పాత్రలో జీవిత కనిపించనున్నారట.

Dhatripriya

Dhatripriya

Next Story