Jeevitha Rajasekhar: చిరంజీవిపై విమర్శలు.. జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష..

Jeevitha Rajasekhar: చిరంజీవిపై విమర్శలు.. జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష..

Arun Chilukuri
Published on: 19 July 2023 11:52 AM IST
Jeevitha Rajasekhar Sentenced to 1 Year Jail in Chiranjeevi Blood Bank Defamation Case
X

Jeevitha Rajasekhar: చిరంజీవిపై విమర్శలు.. జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష..

Jeevitha Rajasekhar: పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు రాజశేఖర్‌, జీవిత దంపతులకు ఏడాది పాటు జైలుశిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సాయిసుధ సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై రాజశేఖర్‌ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. దాంతో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా కూడా విధించింది. కాగా.. జరిమానా చెల్లించడంతో.. అప్పీలుకు అవకాశామిస్తూ జీవిత రాజశేఖర్ దంపతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story