మంచు విష్ణు పై ఘాటుగా రియాక్ట్ అయిన జయసుధ

*మా భవనం గురించి విష్ణు ని నిలదీస్తున్న జయసుధ

Jyothi
Updated on: 2 Aug 2022 8:34 AM IST
Jayasudha Reacts Violently to Manchu Vishnu
X

మంచు విష్ణు పై ఘాటుగా రియాక్ట్ అయిన జయసుధ

Tollywood: అప్పట్లో మా ఎన్నికలు టాలీవుడ్ లోనే పెద్ద వివాదానికి దారితీసాయి. మా ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం పోటీపడిన ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వీరిద్దరి వల్ల ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా విడిపోయిందని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు మాకుంది అంటే మాకుంది అంటూ ప్రకాష్ రాజు మరియు మంచు విష్ణు ఇద్దరు చెప్పుకున్నారు. చివరికి స్థానికేతరుడు కావడంతో ప్రకాష్ రాజు పై వ్యతిరేకత పెరిగి మంచు విష్ణు మా అసోసియేషన్ కు అధ్యక్షుడిగా నిలిచారు. అయితే తాను అధ్యక్షుడిగా విజయం సాధిస్తే సొంత ఖర్చులతో మా భవనాన్ని నిర్మిస్తానని మంచు విష్ణు మాటిచ్చారు కానీ మా అధ్యక్షుడిగా మారిన తర్వాత విష్ణు మళ్ళీ సొంత భవనం మాటే ఎత్తలేదు.

ఇప్పటికీ మంచి విష్ణు మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని పది నెలలు కావస్తోంది. ఈ మధ్యనే మొక్కుబడిగా ఒక మీటింగ్ ని ఏర్పాటు చేశారు కానీ సొంత భవనం గురించి మాట్లాడలేదు. దీంతో గతంలో మా అధ్యక్ష పదవి కోసం రాజేంద్రప్రసాద్ తో పోటీపడి ఓడిపోయిన జయసుధ ఇప్పుడు మంచు విష్ణు పై ఘాటుగా రియాక్టయ్యారు. మా ఎన్నికల గొడవలు చాలా అసహ్యంగా ఉన్నాయని అవి భరించలేక తాను నెలరోజులపాటు అమెరికాకి వెళ్లి ఉండాల్సి వచ్చిందని అన్నారు జయసుధ. నటిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న జయసుధ 75 వసంతంలోకి వచ్చినప్పటికైనా మా భవనం పూర్తవుతుందో లేదో తనకు అర్థం కావడం లేదని, మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అందరూ మాటలు చెబుతున్నారు కానీ పనులు మాత్రం ఎందుకు జరగడం లేదో అర్థం కావడం లేదని అన్నారు జయసుధ. మరి ఈ విషయంలో మా అధ్యక్షుడిగా మంచి విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story