మహేష్ నటనకి ఏడ్చేసిన జయసుధ

Ruthvik
Published on: 25 April 2019 12:17 PM IST
మహేష్ నటనకి ఏడ్చేసిన జయసుధ
X

మహేష్ బాబు తెలుగు సినిమా పరిశ్రమ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నటుడు. తాను ఒక్కో సినిమా లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ 25 సినిమాల వరకు వచ్చాడు. తన 25 వ సినిమా మహర్షి, ఈ నెల 9 న విడుదల అవుతుంది. ఈ సినిమా లో జయసుధ మహేష్ కి తల్లి పాత్రలో నటించారు. ఇటీవలే మీడియా తో మాట్లాడుతూ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పారు జయసుధ.

"ఈ సినిమా లో నేను, ప్రకాష్ రాజ్ మహేష్ కి తల్లిదండ్రులు గా చేస్తున్నాము. నాకు మంచి పాత్ర ఈ సినిమా లో దొరికింది, మహేష్ తో కలిసి పని చేయడం ఎప్పుడూ ఆనందమే. అయితే ఈ సినిమా లో మహేష్ పాత్ర బాగా వచ్చింది. నేను ఒకటి రెండు సీన్లలో మహేష్ తో నటిస్తున్నప్పుడు, మహేష్ నటన ని చూస్తూ, ఎక్స్ప్రెషన్ ఇవ్వడం మర్చిపోయాను. అలా ఉండిపోయి డైలాగ్ కూడా మర్చిపోయాను. ఒక సీన్లో అయితే మహేష్ నటన కి భావోద్వేగానికి గురి ఏడ్చేసాను కూడా. ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ కి పెద్ద పేరు వస్తుంది." అని చెప్పారు జయసుధ. వంశి పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Ruthvik

Ruthvik

Next Story