సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ .. పెరుగుతున్న రాజకీయ మద్దతు

సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ .. పెరుగుతున్న రాజకీయ మద్దతు
x
Highlights

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాలపైన ఫోకస్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ...

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకి ముందు సినిమాలకి బ్రేక్ ఇచ్చి రాజకీయాలపైన ఫోకస్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పవన్ పూర్తి జీవితం రాజకీయలకి, ప్రజలకే అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించడం నాకు భాదేసిందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.."పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాల్లో నటించనని మీరు పూర్వం అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోంది. అందువల్ల నేను పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను" అని అయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

అయితే దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగానే స్పందించారు. ''నాకు సిమెంటు ఫ్యాక్టరీలు, పవర్‌ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి" అని అయన పేర్కొన్నారు.తానూ ఎవరిని పార్టీలో ఉండమని చెప్పానని, భావజాలం ఉన్నవారు మాత్రమే పార్టీలో కొనసాగుతారని పవన్ చెప్పుకొచ్చారు.

అయితే జేడీ నిర్ణయాన్ని తప్పుపడుతూ .. పవన్ సినీ రీఎంట్రీకి మద్దతు తెలుపుతున్నారు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు.. ఇప్పటికే టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపైన మాట్లాడుతూ.. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో నటించారని, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేమీ లేదని, దానివల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. దానికి తోడు బీజేపీ నేత అంబికాకృష్ణ కూడా పవన్ రీఎంట్రీకి మద్దతు తెలిపారు. ఇక తాజగా లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ కూడా మద్దతు తెలిపారు.

సన్మార్గంలో, చట్టబద్దంగా ఆదాయాన్ని ఆర్జించడం తప్పేమికాదని చెప్పారు. నిజాయతీగా పనిచేసి సంపాదిస్తున్నప్పుడు ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం పవన్ కి లేదన్నారు. ఉన్న పార్టీని కాపాడుకోవడం, తన చుట్టూ ఉన్నవారి భవిష్యత్తు కోసం సినిమాల్లో నటించడం తప్పేమీ లేదు అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories