Jatiratnalu: "జాతిరత్నాలు" పై ప్రశంసల వర్షం కురిపించిన బన్నీ

Jatiratnalu: Bunny showers praise on Jatiratnalu
x

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Highlights

Jatiratnalu: జాతిరత్నాలు సినిమా పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Jatiratnalu: జాతిరత్నాలు సినిమా పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. మార్చి 11న శివ‌రాత్రి సంద‌ర్భంగా గాలి సంప‌త్, జాతి ర‌త్నాలు, శ్రీకారం అనే చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ మూడింట్లో జాతి ర‌త్నాలు సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎక్కువ‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాను గ‌త రాత్రి సినిమాను చూసిన అల్లు అర్జున్ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ ట్వీట్స్ చేశాడు. 'గ‌త రాత్రి జాతి ర‌త్నాలు సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో ఏ సినిమా చూసి ఇంత బాగా న‌వ్వ‌లేదు. న‌వీన్ పోలిశెట్టి రాకింగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌రగొట్టాడు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, ఫరియా అబ్దుల్లాల ప‌ర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు' అని బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఈ సినిమాను పైరసీ చేసి పలు వెబ్‌సైట్స్‌లో పెట్టేశారు. సరిగ్గా ఒక్క రోజు కూడా థియేటర్‌లో సినిమా ఆడకముందే 'జాతి రత్నాలు' సినిమా ఫుల్ మూవీ డౌన్‌లోడ్ లింక్ కొన్ని వెబ్‌సైట్స్‌లో దర్శనమివ్వడం షాకిచ్చింది. ఎంతైనా ఇది సినిమా కలెక్షన్స్‌పై ప్రభావితం చూపే అవకాశం ఉంది. కాగా ఇది తమిళ్ రాకర్స్ చేసిన పనే అని కొందరు అంటున్నారు.

చిత్రసీమలో ఎవ్వరికీ అంతుచిక్కని భూతం పైరసీ. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి, రేయింబవళ్లు వందలాది మంది కష్టపడి సినిమా రూపొందిస్తే దాన్ని ఒక్కరోజులోనే పైరసీ చేసి వారి కష్టాన్ని దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ పైరసీ ఇష్యూపై ఎంత అవగాహన కల్పించినా, ఎన్ని చర్యలు తీసుకున్నా వారిని నివారించడం మాత్రం కష్టతరమవుతోంది. నిన్న (గురువారం) విడుదలైన ఈ సినిమాకు పైరసీ రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగలడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories