Jathi Ratnalu Trailer: అన్‌లిమిటెడ్‌ ఫన్‌ ప్యాక్‌

Jathi Ratnalu Trailer: జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను ఈ రోజు (గురువారం) రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు.

Venkata Chari
Updated on: 22 Sept 2021 12:34 PM IST
Jathi Ratnalu Trailer Released by Hero Prabhas
X
జాతి రత్నాలు

Jathi Ratnalu Trailer: జాతిరత్నాలు సినిమా ట్రైలర్ ను ఈ రోజు (గురువారం) రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అన్ లిమిటెడ్ కామెడీతో ప్యాక్ చేశారని తెలుస్తోంది. ఇందులో బీటెక్‌ విద్యార్థి నవీన్‌ పొలిశెట్టి ఓ లేడీస్‌ ఎంపోరియం నడిపిస్తాడు. కానీ ఈ విషయాన్ని బయట చెప్పుకోవడానికి మాత్రం తెగ ఇబ్బందిపడతాడు. ట్రైలర్ లో చాలా ఫన్నీ సీన్స్ ఉండేలా చూసుకున్నారు మేకర్స్. మొత్తానికి జాతి రత్నాలు టీం ట్రైలర్ తో కడుపుబ్బ నవ్వించారనడంలో సందేహం లేదు.

'శత్రువుకు శత్రువు ఏమవుతారంటే అజాత శత్రువు' అని చెప్పడం వంటి కొన్ని డైలాగులు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మా కేసును మేమే వాదించుకుంటాం అని ఈ మూగ్గురు అనగా..అప్పుడు బ్రహ్మానందం అయితే తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి అని కోర్టు హాలును వదిలి వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ ను కూడా ఫుల్ కామోడీగా తీర్చిదిద్దారు.

అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది.


Venkata Chari

Venkata Chari

Next Story