Jathi Ratnalu Collections: 16 రోజుల పాటు 'జాతి రత్నాలు' హవా.. టోటల్ కలెక్షన్స్ ఎంతంటే..

Jathi Ratnalu Collections: తొలి షోతోనే హిట్ టాక్ రావడంతో.. జాతి రత్నాలు సినిమా 16 రోజుల పాటు నిర్మాతలకు కనక వర్షం కురిపించింది.

Venkata Chari
Updated on: 27 March 2021 4:25 PM IST
Jathi Ratnalu Movie 16 Days Collections
X

జాతి రత్నాలు 

Jathi Ratnalu Collections: కడుపుబ్బా నవ్విస్తే.. హిట్ ఖాయమే అన్నట్లు... జాతి రత్నాలు సినిమా మరోసారి నిరూపించింది. తొలి షోతోనే హిట్ టాక్ రావడంతో.. జాతి రత్నాలు సినిమా 16 రోజుల పాటు నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. కరోనా టైం లోనూ వసూళ్ల ప్రవాహం ఆగలేదు. రెండు వారాలుగా సరైన హిట్ సినిమా రాకపోవడంతో ఈ గల్లీ పోరగాళ్ల హవాకు అడ్డులేకుండా పోయింది. నిన్నటితో 16 రోజులు పూర్తిచేసుకున్న ఈ కామెడీ ఎంటటైనర్ ఎన్నో రికార్డులను నెలకొల్పడంతో పాటు రూ. 25 కోట్ల మేర లాభాలు సాధించింది.

బ్రేక్ ఈవెన్ ను కేవలం 3 రోజుల్లోనే దాటేసిన ఈ సినిమా.. 16 రోజులకు గాను రూ. 36.64 కోట్లు వసూలు చేసింది. అలాగే రూ.25 కోట్లకు పైగా లాభాలు అందుకున్న సినిమాగా రికార్డు నెలకొల్పింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో 31.13 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి మరో 1.55 కోట్లు తన అకౌంట్ లో వేసుకుంది. అలాగే ఓవర్సీస్‌లో 3.96 కోట్లు రాబట్టింది. 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36.64 కోట్లు షేర్‌తో పాటు రూ. 60.35 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇకనుంచి జాతి రత్నాలు హవా తగ్గినట్టేనని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. నిన్న కేవలం రూ. 14 లక్షలతో సరిపెట్టుకుంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ హిట్ సాధించినందుకు నిర్మాతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.

స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ 'జాతిరత్నాలు' సినిమాను నిర్మించారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటనకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. డెరెక్టర్ అనుదీప్ కేవీ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story