Ravi Teja: రవితేజ సినిమాలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ?

Ravi Teja: జాతి రత్నలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ చిత్రంతో కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెరంగేట్రం చేసింది.

Venkata Chari
Published on: 15 March 2021 4:21 PM IST
Jathi Ratnalu Heroine in Ravi Teja New Movie
X

ఫరియా అబ్దుల్లా, రవితేజ (ఫొటో హన్స్ ఇండియా)

Ravi Teja: జాతిరత్నలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ చిత్రంతో కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పెద్ద హిట్ సాధించడంతో.. హీరోయిన్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఫరియా అబ్దుల్లా.. హీరో రవితేజ తదుపరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమె కోసం టీం మేనెజ్ మెంట్ చర్చలు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్ నడుస్తోంది. తృణధ్ రావు నక్కినా ఈ చిత్రానికి దర్శకుడు. అయితే, మెయిన్ హీరోయిన్ కోసమా లేదా మరేదైనా ఇంపార్టెంట్ పాత్ర కోసమా అనేది తెలియాల్సి ఉంది.

ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఫిరియా అబ్దుల్లా కూడా సముఖంగానే ఉన్నట్లు సమాచరం. కాగా, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

Venkata Chari

Venkata Chari

Next Story