Naveen Polishetty: కొత్త దర్శకుడుతో చేతులు కలపనున్న నవీన్ పొలిశెట్టి

Sandeep Reddy
Published on: 20 Aug 2021 2:44 PM IST
Jathi Ratnalu Hero Naveen Polishetty Planning to New Movie With Director Kalyan Shankar
X

నవీన్ పోలిశెట్టి (ఫైల్ ఫోటో)

Naveen Polishetty New Movie: యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన మొదటి సినిమా "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" తోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన "జాతిరత్నాలు" కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇక నవీన్ పోలిశెట్టి తదుపరి సినిమా గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాతి రత్నాలు సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో నవీన్ పోలిశెట్టి మీద ఆఫర్ల వర్షం కురిసింది. కానీ ఈ యంగ్ హీరో మాత్రం ఇంకా తన తదుపరి సినిమా గురించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తాజాగా నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కనుంది అని పుకార్లు పుట్టుకొచ్చాయి కానీ దాని గురించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం నవీన్ పోలిశెట్టి ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించనుంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి ఇప్పటికే "జాతిరత్నాలు" సీక్వెల్ చేయబోతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. "జాతి రత్నాలు" సినిమాకి దర్శకత్వం వహించిన అనుదీప్ కే వి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించనున్నారు. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం యూఎస్ లో జరుగుతుందని సమాచారం. ఈ సినిమా గురించి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story