Naveen Polishetty: 'జాతి రత్నాలు' మార్చేసింది

Naveen Polishetty: జాతి రత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి జాతకం మారినట్టుంది.

Venkata Chari
Published on: 17 March 2021 6:16 PM IST
Jathi Ratnalu results in changes to his next
X

నవీన్ పొలిశెట్టి 

Naveen Polishetty: జాతి రత్నాలు సినిమాతో నవీన్ పొలిశెట్టి జాతకం మారినట్టుంది. తన నెక్ట్ సినిమాలో స్ర్కిప్ట్‌ను మార్చి, తన పాత్ర స్ర్కీన్‌ పై ఎక్కువ సేపు కనిపించేలా చేసింది ఈ మూవీ. అనుష్క శెట్టి రాబోయే చిత్రంలో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నలు తరువాత చేస్తున్న నవీన్ పొలిశెట్టి చేస్తున్న మూడో సినిమా ఇది.

అయితే.. జాతి రత్నాలు సూపర్ హిట్ కావడంతో.. అనుష్క చిత్రంలోని నవీన్ పొలిశెట్టి పాత్రలో కొన్ని మార్పులు చేశారంట. ఈ హీరోకి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇచ్చేందుకే ఫిల్మ్ యూనిట్ స్ర్కిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ జానర్ లో రానున్న సినిమాలో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా కనిపించనున్నారు.

కాగా, ఈ సినిమాలో 40 ఏళ్ల వయసు గల పాత్రలో అనుష్క శెట్టి నటించనుండగా.. 20 ఏళ్ళ కుర్రాడి పాత్రలో నవీన్ పొలిశెట్టి కనిపించనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రా రా కృష్ణయ్య చిత్రంతో దర్శకుడిగా మారిన మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story