Jani Master: నాపై కావాలనే కుట్ర చేశారు.. సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదు..

Jani Master: లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ఇవాళ్టితో ముగియనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Sept 2024 1:35 PM IST
Jani Master: నాపై కావాలనే కుట్ర చేశారు.. సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదు..
X

Jani Master: నాపై కావాలనే కుట్ర చేశారు.. సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదు..

Jani Master: లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ఇవాళ్టితో ముగియనుంది. మూడు రోజుల పాటు ఆయనను పోలీసులు విచారించారు. కాసేపట్లో జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.మరో వైపు జానీమాస్టర్ కస్టడీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. మైనర్‌గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశాననేది అబద్ధమని...తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఛాన్స్‌ ఇచ్చానని తెలిపారు.

తనని పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించేదన్నారు. ఎన్నోసార్లు ఆమె తనను బెదిరించిందని పోలీసులకు వెల్లడించారు. విషయాన్ని డైరెక్టర్ సుకుమార్‌ దృష్టికి తీసుకెళ్లానని...సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదన్నారు. తనపై కావాలనే వెనుక ఉండి కుట్ర చేశారన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేక కుట్ర చేశారని జానీ మాస్టర్ విచారణలో వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story