Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్.. హైదరాబాద్‌ తీసుకొస్తున్న పోలీసులు..!

Jani Master Arrest: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైద్రాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. పిటి వారెంట్ పై ఆయనను హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 19 Sept 2024 1:45 PM IST
Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్..
X

Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్..

Jani Master Arrest: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైద్రాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు.ట్రాన్సిట్ వారెంట్ పై ఆయనను హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై రేప్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. నెల్లూరు, లడాఖ్ లలో జానీ మాస్టర్ ఉన్నారనే సమాచారంతో ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లాయి. అయితే గోవాలో ఆయన ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

నార్సింగి పోలీసులను ఆశ్రయించడానికి మూడు వారాల ముందే ఈ విషయమై బాధితురాలు ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఫిలిం చాంబర్ విచారణ జరుపుతోంది. జానీ మాస్టర్ తో పాటు బాధితురాలి స్టేట్ మెంట్ ను కూడా తీసుకున్నారు. బాధితురాలికి అండగా ఉంటామని ఛాంబర్ హామీ ఇచ్చింది. మరోవైపు ఇదే విషయమై మహిళా సంఘాల ప్రతినిధులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి రక్షణ కల్పించాలని మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story