Janhvi Kapoor: ప్రియుడితో కలిసి తిరుమలలో జాన్వీ కపూర్ సందడి

Janhvi Kapoor: శ్రీవారి దర్మించుకున్న బాలీవుడ్ నటి ఝాన్వి కపూర్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Aug 2024 3:22 PM IST
Janhvi Kapoor Visited Tirumala Temple
X

Janhvi Kapoor: ప్రియుడితో కలిసి తిరుమలలో జాన్వీ కపూర్ సందడి

Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చినా జాన్వీ కపూర్ తో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.

ప్రతి సినిమా విడుదలకు ముందు ఝాన్వి కపూర్ శ్రీవారిని దర్శించుకోవడం అనవాయితీగా పెట్టుకుంది. అమ్మ శ్రీదేవి జన్మదినం సందర్భంగా తిరుమలకు రావడం విశేషం. తనతో పాటు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియాతో తిరుమలకు సోమవారం రాత్రి చేరుకొని., మంగళవారం ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story