Mahesh Babu: ప్రిన్స్ తో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్

Mahesh Babu: ఆ తరంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ, శ్రీదేవి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Venkata Chari
Published on: 16 March 2021 4:12 PM IST
Prince Mahesh Babu Romance Janhvi Kapoor
X

మహేశ్ బాబు, జాన్వీ కపూర్ (ఫొటో ట్విట్టర్)

Mahesh Babu: ఆ తరంలో సూపర్‌ స్టార్‌ కృష్ణ, శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అప్పట్లో కృష్ణ, శ్రీదేవి జోడీకి అంత క్రేజ్‌ ఉండేది. ఇదిలా ఉంటే కృష్ణ కుమారుడు ప్రిన్స్ మహేశ్‌బాబు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ జోడీగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వీరి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు టాక్. ఓ కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ కూడా కేవలం రెండు నెలల్లోనే ఫినిష్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారంట. మరి ఈ ప్రాజెక్ట్‌ పై పూర్తి వివరాలు తెలియాలంటే.. అధికారికంగా వివరాలు వెలువడాల్సిందే.

అయితే, మహేశ్‌ ప్రస్తుతం 'గీతా గోవిందం' మూవీ డైరెక్టర్ పరశురామ్‌ తో 'సర్కారు వారి పాట' సినిమాతో బిబీగా ఉన్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తవగానే మహేశ్‌ జాన్వీతో సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాతే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్‌ నటించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన హార్రర్‌ సినిమా 'రూహీ'కి మిశ్రమ స్పందన వస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story