అల్లు అర్జున్ తో శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!?

admin1
Published on: 18 Aug 2021 2:39 PM IST
Janhvi Kapoor May be act as a Heroine in Allu Arjun New Movie | Telugu Cinema News
X

అల్లు అర్జున్ - ఝాన్వి కపూర్ (ఫైల్ ఫోటో)

Janhvi Kapoor - Allu Arjun New Movie: శ్రీదేవి కూతురు అయిన జాన్వికపూర్ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ లో సైతం ఈ బాలీవుడ్ భామను పరిచయం చేయాలని చాలామంది నిర్మాతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ దర్శకులు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశారు కానీ ఏదీ సెట్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు వేణు శ్రీరామ్ జాన్వీ కపూర్ ని తెలుగులో పరిచయం చేయాలని అనుకుంటున్నారట.

ఈమధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "ఐకాన్" సినిమా తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం ఫ్రెష్ ఫేస్ ను వెతుకుతున్న వేణు శ్రీరామ్ కు జాన్వికపూర్ అయితే ఆ పాత్రకు చాలా బాగా సెట్ అవుతుందని ఆలోచన వచ్చిందట. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మరియు శ్రీరామ్ ఇప్పటికే జాన్వీ మేనేజర్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ మధ్యనే "రూహి" సినిమాతో డిజాస్టర్ అందుకున్న జాన్వికపూర్ తెలుగులో అడుగుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

admin1

admin1

Next Story