Janhvi Kapoor: సౌత్ ఇండియన్ సినిమాలపై అభిప్రాయం చెప్పిన జాన్వికపూర్

Janhvi Kapoor: సౌత్ ఇండియన్ సినిమాలో నటించాలని ఉంది అంటున్న జాన్వీకపూర్

admin1
Published on: 27 Oct 2021 7:32 PM IST
Janhvi Kapoor Says Opinion on South Indian Films
X
సౌత్ ఇండియన్ సినిమాలపై తన అభిప్రాయాన్ని చెప్పిన జాన్వీ కపూర్ (ఫైల్ ఇమేజ్)

Janhvi Kapoor: శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరపై చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈమె ను హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజాగా సౌత్ సినిమా లలో ఎంట్రీ పై తన అభిప్రాయం ఏంటి అని అడగగా జాన్వికపూర్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. "సౌత్ ఇండియన్ సినిమాలో నటించాలని నాకు చాలా కాలంగా ఉంది. మీరు నా ఫోన్ చూసినా లేదా నెట్ఫ్లిక్స్ చూసిన అన్ని సౌత్ ఇండియన్ సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు" అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

తను ఈ మధ్య చూసిన మలయాళం సినిమా ట్రాన్స్ గురించి మాట్లాడుతూ, "ఫాహధ్ ఫాసిల్ చాలా అద్భుతమైన నటుడు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ చాలా మంది హై లెవెల్ ఆర్టిస్టులతో పని చేస్తుంది. కాబట్టి ఆ ప్రపంచం కూడా నాకు చూడాలని ఉంది. ఇప్పటిదాకా కొంతమంది దర్శకుల తో మాట్లాడాను కానీ అందులో ఏ కథ నాకు అంత బాగా నచ్చలేదు" అని చెప్పుకొచ్చింది జాన్వీ. మాతృభాష ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో నటీనటులు భాషా బేధాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలో నటులు వేరే ఇండస్ట్రీలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story