RC16: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్.. కన్ఫామ్ చేసిన బోనీ కపూర్..!

RC16: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్.. కన్ఫామ్ చేసిన బోనీ కపూర్..!

Arun Chilukuri
Published on: 20 Feb 2024 12:12 PM IST
Janhvi Kapoor Pairs With Ram Charan In Rc16
X

RC16: రామ్ చరణ్‌తో జాన్వీ కపూర్.. కన్ఫామ్ చేసిన బోనీ కపూర్..!

Ram Charan RC16 Update: లెజెండరీ నటి శ్రీదేవి మరియు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ల పెద్ద కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైంది. స్టార్ కిడ్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న జాన్వీ హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తూ తన పైన శైలిలో దూసుకు వెళుతోంది.

తాజాగా జాన్వీ కపూర్‌ తెలుగులో మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నారు. హీరో రామ్‌ చరణ్‌కి ఆమె జోడీగా నటించనున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా (‘ఆర్‌సీ 16’ వర్కింగ్‌ టైటిల్‌) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీకపూర్‌ స్వయంగా వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తున్న జాన్వీ, త్వరలోనే రామ్‌చరణ్‌తోనూ జట్టు కడుతోంది. సూర్యతోనూ ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలా నా కుమార్తె కూడా నటిస్తుంది’’ అన్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే చిత్రమిది. క్రీడాకారుడిగా రామ్‌చరణ్‌ తెరపై సందడి చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story