లైగర్ సినిమాను మిస్ చేసుకున్న.. యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Janhvi Kapoor: అసలైతే "లైగర్" లో ఆమె హీరోయిన్ గా నటించాలా?

Jyothi
Updated on: 19 Aug 2022 1:41 PM IST
లైగర్ సినిమాను మిస్ చేసుకున్న.. యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
X

లైగర్ సినిమాను మిస్ చేసుకున్న.. యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది అని గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తునే ఉన్నాయి. ఇప్పటికే పలు టాలీవుడ్ స్టార్ హీరోలతో ఈమె జతకట్టబోతోంది అని వార్తలు వినిపించాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజాగా ఈమెకి ఒక సినిమా వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందని తెలుస్తోంది. ఆ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "లైగర్". పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతోంది.

తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ సినిమాకి ముందుగా జాన్వి కపూర్ ను హీరోయిన్ గా అనుకున్నట్టు చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. అయితే అప్పుడు జాన్వి కపూర్ వేరే సినిమాతో బిజీగా ఉండి డేట్ లు కుదరకపోవడంతో ఆమె ఈ సినిమాకు సైన్ చేయలేక పోయిందని క్లారిటీ ఇచ్చారు పూరి. మరి జాన్వి కపూర్ కి మళ్ళీ తెలుగులో నటించే అవకాశం ఎప్పుడొస్తుందో చూడాలి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story