తిరుమలేశుని సన్నిధిలో జాన్వీ కపూర్

* జాన్వీతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు

R Tripura Malini
Published on: 2 Dec 2022 6:38 AM IST
Janhavi Kapoor At Tirumala
X

తిరుమలేశుని సన్నిధిలో జాన్వీ కపూర్

Janhavi Kapoor: తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. జాన్వీ కపూర్ తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆమె వెంట పడ్డారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story