జేమ్స్ బాండ్ నటికి కరోనా వచ్చింది

జేమ్స్ బాండ్ నటికి కరోనా వచ్చింది
x
Olga Kurylenko told fans to take coronavirus seriously
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన కరోనా వైరస్ మెల్లిమెల్లిగా 140 పైగా దేశాలకి సోకి 6500 మంది పైగా ప్రాణాలను బలితీసుకుంది.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన కరోనా వైరస్ మెల్లిమెల్లిగా 140 పైగా దేశాలకి సోకి 6500 మంది పైగా ప్రాణాలను బలితీసుకుంది. ఇక అమెరికాలో కరోనా వైరస్‌తో 65 మంది చనిపోయారు. మూడు వేలకి పైగా కేసులు నమోదు అయ్యాయి. అందులో జేమ్స్ బాండ్ నటి మోడల్ ఓల్గా కురిలెంకో కూడా ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది.

"నాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంట్లోనే ఉన్నాను. వాస్తవానికి వారం రోజులుగా నేను అనారోగ్యంతో ఉన్నాను. జ్వరం, ఆయాసం లక్షణాలు నాలో ఉన్నాయి. మీరు జాగ్రత్త పాటించండి. దీన్ని సీరియస్‌గా తీసుకోండి" అంటూ ఆమె పోస్ట్ చేసింది. మోడల్ ఓల్గా కురిలెంకో కి ప్రస్తుతం 40 సంవత్సరాలు..2008 జేమ్స్ బాండ్ "క్వాంటం ఆఫ్ సొలేస్" అనే చిత్రంలో డేనియల్ క్రెయిగ్ సరసన కెమిల్లె మోంటెస్ పాత్రలో ఆమె నటించారు.

ఇక గత వారం ఆస్కార్ అవార్డు పొందిన నటుడు టామ్ హాంక్స్ భార్య, నటి మరియు గాయని రీటా విల్సన్ కి ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిందని వెల్లడించాడు.

సుమారు 140 దేశాలకు పైగా ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 6,526 మంది మృతి చెందినట్లు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories