NBK107: మరోసారి 'జై బాలయ్య'తో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్!

Jai Balayya New Song In NBK 107
x

NBK107: మరోసారి ‘జై బాలయ్య’తో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయ్!

Highlights

అఖండ సెంటిమెంట్ వాడబోతున్న గోపీచంద్ మలినేని

NBK107: సింహా, లెజెండ్ వంటి సినిమాల తరువాత నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ" కరోనా టైం లో విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా విడుదల సమయంలో అసలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అని అనుమానం ఉంది కానీ అది సినిమా విడుదలైన మొదటి రోజు తోనే పటాపంచలైపోయింది.

బోయపాటి శ్రీను కరియర్ లో మాత్రమే కాక బాలకృష్ణ కరియర్ లో కూడా "అఖండ" సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా మారడం విశేషం. ఈ సినిమాలో "జై బాలయ్య" పాట సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. బాలయ్యను కీర్తిస్తూ ఉండే ఈ పాట సినిమాకి విపరీతమైన హైప్ ను తెచ్చిపెట్టింది. అయితే తాజాగా బాలకృష్ణ తదుపరి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేని కూడా ఇదే సెంటిమెంట్ ని బాలయ్య సినిమాలో కూడా వాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట.

ఈ సినిమాకి "జై బాలయ్య" అనే టైటిల్ ని అనుకుంటున్నట్లుగా ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే సినిమాలో కూడా "జై బాలయ్య" అంటూ ఒక మాస్ పాటని కూడా రూపొందిస్తున్నారట. మరి "జై బాలయ్య" పాట అఖండ కి వర్క్ అయినట్టు గోపీచంద్ మలినేని-బాలయ్య సినిమాకి అవుతుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories