బాలయ్య కోసం విలన్ గా మారనున్న ఫామిలీ హీరో

Ruthvik
Published on: 28 April 2019 5:39 PM IST
బాలయ్య కోసం విలన్ గా మారనున్న ఫామిలీ హీరో
X

ఒకప్పుడు జగపతిబాబు అంటే ఫ్యామిలీ హీరో. సాఫ్ట్ ఇమేజ్ ఉన్న జగపతిబాబు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోగా కరియర్ ముగిసి పోయింది అనుకున్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన 'లెజెండ్' సినిమాలో విలన్ పాత్రలో కనిపించటం జగపతి బాబు కి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కుతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు జగపతిబాబు. అప్పటి నుంచి వరుసగా విలన్ లేదా తండ్రి పాత్రలతో బిజీ అయిపోయారు.

అయితే 'లెజెండ్' సినిమా తరువాత బాలయ్య సినిమాలో జగపతి బాబు మళ్లీ కనిపించలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మళ్లీ 'లెజెండ్' కాంబో రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. 'జైసింహ' ఫేమ్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిబాబు ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ మళ్లీ ఇలాంటి ఈ పవర్ ఫుల్ యాక్షన్ కాంబినేషన్ ని తెరపై చూసేందుకు ప్రేక్షకులు మాత్రం బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అన్నీ కుదిరితే ఎన్నికల ఫలితాలు వచ్చే ముందే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Ruthvik

Ruthvik

Next Story