కరోనా వల్ల మేకప్‌మెన్‌గా మారిన టాలీవుడ్ సీనియర్ నటుడు

Tollywood: తెలుగు హీరో, కార్యెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు మేకప్ మెన్ గా మారారు.

Samba Siva Rao
Published on: 19 April 2021 10:31 AM IST
Jagapathi Babu Turned Into makeup Man
X

జగపతి బాబు ఫైల్ ఫోటో 

Tollywood: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు అందరూ ఈ మహమ్మరి లిస్ట్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరిపోతుంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే పలవురు నటీనటులు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో అనేక మంది షూటింగ్ లోకేషన్స్ వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు జగపతి బాబు మేకప్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. కంగారు పడిపోకండి జగపతి బాబు సినిమాలు లేక అలా మారలేదు. కోవిడ్‌ దృష్ట్యా చాలా వరకు అసిస్టెంట్‌ల సహాయం తీసుకోకుండా తమ పనులు తామే చూసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జగపతి బాబు కూడా తన మేకప్ తానే స్వయంగా వేసుకున్నాడు.

ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. తన ట్వీటర్ లో పోస్ట్ చేశాడు. తాజాగా ఓ షూటింగ్‌ లొకేషన్‌లో జగపతి బాబు.. కరోనా కారణంగా తనకు తానే మేకప్‌మెన్‌గా మారిపోయారు. ఫోటోను తన ట్వీట్ లో షేర్ చేస్తూ థ్యాంక్యూ కోవిడ్‌..నీ వల్ల మేకప్ ‌మెన్‌ని అయ్యానంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బీజీగా గడుపుతున్నారు. ఇటీవల జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన FCUK సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా జగపతి బాబుకు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story