Salaar Movie Update: ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో జగపతి బాబు

Salaar Movie Update: ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో జగపతి బాబు
x

ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో జగపతి బాబు

Highlights

Salaar Movie Update - Jagapthi Babu: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Salaar Movie Update - Jagapthi Babu: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ చేతిలో చాలానే భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అందులో "సలార్" ఒకటి. "కేజీఎఫ్" సినిమాతో అందరి దృష్టిని కన్నడ ఇండస్ట్రీ పై పడేలా చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోనే శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ షెడ్యుల్ లో జాయిన్ అయ్యింది. తాజాగా ప్రభాస్ ఇంటి భోజనంతో శ్రుతి కి ట్రీట్ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం వివిధ భాషల నుండి స్టార్ నటీనటులను తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు జగపతిబాబు ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ లో జగపతిబాబు కూడా పాల్గొనడంతో ఈ విషయం వెలుగుచూసింది. సినిమాలో ఆయన పాత్ర కు చాలా ప్రాధాన్యత ఉంటుందట. మరి జగపతి బాబు ది ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ను సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories