Jagapathi Babu: ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్లు చేస్తున్నా జగపతి బాబు

Jagapathi Babu: ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్లు చేస్తున్నా జగపతి బాబు

admin1
Updated on: 17 Jan 2022 9:30 PM IST
Jagapathi Babu is Making Shocking Comments About Jr NTR | Tollywood News Online
X

ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్లు చేస్తున్నా జగపతి బాబు

Jagapathi Babu: హీరోగా చేస్తున్నప్పుడు కంటే విలన్ గా మారాక జగపతిబాబుకి ఆఫర్లు పెరిగాయి అనడంలో అతిశయోక్తిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న నటులలో బాగా డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల లో జగపతిబాబు కూడా ఒకరు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటించిన "అరవింద సమేత వీర రాఘవ" సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి తన క్యారెక్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు జగపతిబాబు. "అరవింద సమేత వీర రాఘవ స్క్రిప్ట్ చాలా బాగా కుదిరింది. అందులో నా క్యారెక్టర్ అగ్రెసివ్. కానీ తారక్ ది చాలా కూల్ క్యారెక్టర్ దీంతో నా పాత్ర బాగా ఎలివేట్ అయింది" అని అన్నారు జగపతి బాబు.

"అంత పెద్ద హీరో అయ్యుండి నా పాత్రను ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ ఆటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్రను ఒప్పుకున్నాడు కానీ తర్వాత నాకు కావలసిన అంత పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. షూటింగ్ సమయంలో నాకు రోజు ఫోన్ చేసి మీ పాత్ర చాలా బాగుంది అంటూ రకరకాలుగా ప్రేమగా తిట్టేవాడు. సినిమా ఫంక్షన్లలో కూడా మాట్లాడుతూ సినిమా చూసిన వారికి బసిరెడ్డి పాత్ర బాగా గుర్తు ఉంటుంది తర్వాత నేను గుర్తు ఉంటాను అన్నాడు. హీరో అలా అనడం చాలా పెద్ద స్టేట్మెంట్. అయితే ఆ సినిమా తర్వాత 'బాబు మీకు నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు. నాలుగైదేళ్లు మీ మొఖం నాకు చూపించకండి' అని తారక్ అన్నాడు. దానికి నేను ఒకే అన్నాను" అని చెప్పుకొచ్చారు జగపతి బాబు.

admin1

admin1

Next Story