Pushpa 2: పుష్ప2 షూటింగ్ మళ్లీ మొదలు..సెట్స్ పైకి జగపతి బాబు..

Pushpa 2: పుష్ప2 వీడియోకి దక్కిన రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అందుకు నిదర్శనం

Dhatripriya
Updated on: 21 April 2023 2:01 PM IST
Jagapathi Babu Is Back On The Sets Of Pushpa 2
X

Pushpa 2: పుష్ప2 షూటింగ్ మళ్లీ మొదలు..సెట్స్ పైకి జగపతిబాబు 

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి జగపతి బాబు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే పుష్ప2 షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు జగపతి బాబు అనౌన్స్ చేశారు. మైత్రి మూవీస్ సంస్థపైనే కాకుండా సుకుమార్ ఆఫీస్ పై కూడా ఐటీ శాఖ దాడులు చేయడంతో పుష్ప2 షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చాలా డీలా పడ్డారు. సినిమా షూటింగ్ ఉంటుందా లేదా.. ఉంటే మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు...అనుకున్న టైమ్ కు పుష్ప2 వస్తుందా రాదా...ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడాయి. అయితే త్వరలో పుష్ప2 షూటింగ్ లో పాల్గొంటున్నానంటూ జగపతిబాబు ప్రకటించడంతో ఫ్యాన్స్ అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి.

ఐటీ రైడ్స్ కారణంగా వైజాగ్ లో జరుగుతున్న షూటింగ్ ని అర్థాంతరంగా ఆపేసిన నిర్మాతలు అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప అనే స్పెషల్ వీడియో పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అయింది. పుష్ప2 కోసం టోటల్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోందంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పుష్ప2 వీడియోకి దక్కిన రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అందుకు నిదర్శనం.

పుష్ప2 పై ఆడియెన్స్ క్రేజ్ ని పక్కనపెడితే ఈ ప్రాజెక్ట్ లోకి ఇప్పుడు జగపతిబాబు కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుకుమార్ తీసిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో జగపతిబాబు పాత్రలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో మనకు తెలిసిందే. అయితే పుష్ప లో జగపతిబాబు లేకపోవడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే పుష్ప2లో ఎంట్రీ ఇస్తున్నానని స్వయంగా జగపతిబాబు ప్రకటించడంతో అందరు సంబరపడుతున్నారు. అయితే ఆయనది పాజిటివ్ రోలా లేదా నెగిటివ్ రోలా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మొత్తానికి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story