Jagapati Babu: బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న జగపతి బాబు

* బాలీవుడ్ లో విలన్ గా మారనున్న జగపతి బాబు

admin1
Updated on: 23 Oct 2021 6:00 PM IST
Jagapathi Babu Bollywood Entry as Villain With Ashutosh Gowariker Movie | Movie News Today
X

జగపతి బాబు (ట్విట్టర్ ఫోటో)

Jagapathi Babu - Pukar Movie: ఒకప్పుడు హీరోగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ గా ప్రేక్షకులను అలరించడంలో ముందున్నారు జగపతిబాబు. ఒకవైపు తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా జగపతి బాబు కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల లో జగపతి బాబు కూడా ఉన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం జగపతిబాబు కి ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశం వచ్చిందట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ రూపొందించనున్న ఒక సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు.

అయితే అశుతోష్ గోవారికర్ ప్రస్తుతం ప్లాప్ లలో ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన "మొహంజోదారో", "పానిపట్" వంటి సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లు గా నిలిచాయి. దీంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ తాజాగా ఒక మంచి కథని సిద్ధం చేసుకున్నారు.

ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు. ఫర్హాన్ ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిబాబు ని ఎంచుకున్నారు దర్శకనిర్మాతలు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం ఫారెస్ట్ లొకేషన్స్ లోనే జరగబోతోందట.

admin1

admin1

Next Story