'ఆర్ ఆర్ ఆర్' కోసం శ్రీలంకన్ బ్యూటీ

Ruthvik
Updated on: 24 April 2019 4:30 PM IST
ఆర్ ఆర్ ఆర్ కోసం శ్రీలంకన్ బ్యూటీ
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే రామ్ చరణ్ కు చిన్న గాయం అయిందని తెలిసిన విషయమే. అయితే తాజాగా ఎన్టీఆర్ కి కూడా దెబ్బ తగిలింది. మరొకవైపు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ విషయంలో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్గా తప్పుకున్న తర్వాత ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్లు శ్రద్ధ కపూర్, పరిణీతి చోప్రా పేర్లను అనుకున్నారు. కానీ నీ ఇద్దరూ తమకున్న కమిట్మెంట్ ల మూలాన ఈ సినిమాలో భాగం కాలేకపోతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మరొక బాలీవుడ్ హీరోయిన్ పేరు బయటకు వస్తోంది. ఆమె ఎవరో కాదు శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. తాజా సమాచారం కొమరం భీమ్ పాత్ర చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్రిటిష్ అమ్మాయిని ప్రేమిస్తాడు. కథ మరియు పాత్ర ప్రకారం అయితే అమీ జాక్సన్ బాగుంటుంది కానీ ఆమె ఇప్పుడు గర్భవతి కాబట్టి చిత్రబృందం ప్రస్తుతం జాకీ పైన కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పైగా మరోవైపు 'ఆర్ఆర్ఆర్' చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Ruthvik

Ruthvik

Next Story