Jacqueline Fernandez: "కాజల్" బదులు నాగార్జున సరసన బాలీవుడ్ బ్యూటీ

* సినిమాల నుంచి గ్యాప్ తీసుకోబోతున్న కాజల్ ఈ సినిమా నుంచి కూడా తప్పుకోవటం జరిగింది.

admin1
Updated on: 25 Sept 2021 5:00 PM IST
Jacqueline Fernandez Acting with Nagarjuna in Place of Kajal in The Ghost Movie
X

 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - నాగార్జున (ఫోటో- ది హన్స్ ఇండియా)

Jacqueline Fernandez in The Ghost Movie: స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గతేడాది బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ గర్భవతి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తను హీరోయిన్ గా నటించిన "ది గోస్ట్" సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

నాగార్జున హీరోగా నటిస్తున్న "ది ఘోస్ట్" సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్ర కోసం సైన్ చేసింది. కానీ ఇప్పుడు సినిమాల నుంచి గ్యాప్ తీసుకోబోతున్న కాజల్ ఈ సినిమా నుంచి కూడా తప్పుకోవటం జరిగింది.

ఈ నేపథ్యంలో కాజల్ స్థానంలో ఇంకెవరినీ హీరోయిన్ గా తీసుకుంటారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఇలియానా మరియు త్రిష పేర్లు బయటికి వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సంప్రదించినట్లు సమాచారం.

దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక మరోవైపు కాజల్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టుల షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేయబోతోంది.

admin1

admin1

Next Story