Jabardasth Vinod: వివాదంలో చిక్కుకున్న జబర్దస్త్‌ వినోద్‌

Jabardasth Vinod Assaulted by House Owner
x

Jabardasth Vinod: వివాదంలో చిక్కుకున్న జబర్దస్త్‌ వినోద్‌

Highlights

Jabardasth Vinod: జబర్దస్త్ కెమెడియన్ వినోద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా వినోద్ కొనుగోలు చేసిన ఇల్లు వ్యవహారం వివాదాస్పదమయ్యింది.

Jabardasth Vinod: జబర్దస్త్ కెమెడియన్ వినోద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా వినోద్ కొనుగోలు చేసిన ఇల్లు వ్యవహారం వివాదాస్పదమయ్యింది. ముందుగా నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధర చెల్లించాలంటూ బిల్డర్లు డిమాండ్ చేస్తూ దాడికి దిగారంటున్నారు. వినోద్ ఇంట్లో ఉన్న తల్లిని సైతం బెదిరించినట్టు వినోద్ చెబుతున్నాడు. బిల్డర్ల నుంచి కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ హెచ్ఎంటీవీని ఆశ్రయించాడు వినోద్.

గతంలోనూ వినోద్ పై కొందరు దాడి చేసి చితకబాదారు. అయితే తాజా వ్యవహారంలో ముందుగా నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించాల్సిందిగా బిల్డర్ డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు వినోద్ చెబుతున్నాడు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ వినోద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జబర్దస్త్ కెమెడీ షోలో ఆడ వేషంలో నటిస్తూ వినోద్ వినోదినిగా పాపులర్ అయ్యాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories