Sudheer-Rashmi: రష్మితో ప్రేమ వ్యవహారంపై సుధీర్ షాకింగ్ కామెంట్స్

Sandeep Reddy
Updated on: 16 July 2021 3:39 PM IST
Jabardasth Sudigali Sudheer Says Rashmi Gautam Is Just a Friend and We Are Not in Love
X

సుడిగాలి సుధీర్, రష్మి(ఫైల్ ఫోటో)

Sudigali Sudheer-Rashmi: సుడిగాలి సుధీర్ బుల్లితెరలో ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ అతని సొంతం. సినిమా పరిశ్రమకి రాకముందు మ్యాజిక్ షోలు చేసే ఈ నటుడు జబర్దస్త్ లో వచ్చిన ఒక ఆఫర్ తో కామెడీతో పాటు తన టాలెంట్ ని నమ్ముకున్న సుధీర్ కాస్త సుడిగాలి సుధీర్ అయిపోయాడు. ప్రస్తుతం కమెడియన్, యాంకర్ మరియు సినిమాల్లో కూడా హీరోగా కూడా నటిస్తున్న సుధీర్ కి జబర్దస్త్ యాంకర్ రష్మి మధ్య ప్రేమాయణం నడుస్తుందని గత కొన్ని ఏళ్ళుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తోడు కొన్ని ప్రముఖ చానల్స్ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని రకరకాల ప్రోగ్రామ్స్ కూడా ప్రసారం చేసి సక్సెస్ అయ్యారు. ఇలా చానల్స్ చేసే ప్రోగ్రామ్స్ తో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి బుల్లితెర సుధీర్ రష్మి అభిమానులు కాస్త గందరగోళంలో ఉన్న వారి మధ్య ఏదో ఉందనే ఊహ బాగుందని మరికొంత మంది అభిమానులు సంబురపడుతున్నారు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుడిగాలి సుధీర్ తనకి రష్మికి మధ్యన ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు. తెరపై కనిపించినట్టుగా రష్మికి తనకి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని, రష్మి నేను మంచి స్నేహితులమని తెలిపాడు. కేవలం బుల్లితెరలో జరిగే కొన్ని కార్యక్రమాలకే తమ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఉంటుందని నిజానికి రష్మితో ఈ మధ్యే ఫోన్ లో మాట్లాడటం మొదలు పెట్టానన్నాడు. రష్మి సినిమా కెరీర్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయి వరకు వచ్చిందని తను అంటే వ్యక్తిగతంగా చాలా గౌరవం అని అన్నాడు. ఇన్ని రోజులు సుధీర్ రష్మి మధ్య ఏదో ఉంది అనుకునే వాళ్ళు.. సోషల్ మీడియాలో వారి ప్రేమ గురించి రాసేవారికి తన ఇంటర్వ్యూ తో చెక్ పెట్టేసాడు సుధీర్. ప్రస్తుతం హీరోగా "గాలోడు" సినిమా షూటింగ్ తో పాటు ఒక ప్రముఖ ఛానల్ లో దాదాపుగా అన్ని ప్రోగ్రామ్స్ లో అటు యాంకర్ గా, కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story