Jabardasth: ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం..

Jabardasth Praveen: జబర్దస్త్ ఈ షోకు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Arun Chilukuri
Published on: 17 Aug 2022 6:25 PM IST
Jabardasth Praveen Father Passed Away
X

Jabardasth: ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం..

Jabardasth Praveen: జబర్దస్త్ ఈ షోకు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జడ్జిలు, కంటెస్టెంట్స్ మారినా కూడా షో రేటింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందరో కమెడియన్స్‌ను పరిచయం చేసింది ఈ బుల్లితెర నవ్వుల షో. ఇప్పుడు వారిలో చాలామంది సిల్వర్ స్క్రీన్‌పై సైతం రాణిస్తున్నారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించుకున్న నటుల్లో ప్రవీణ్ ఒకడు. పటాస్ షోతో ప్రవీణ్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో సందడి చేస్తున్నాడు. ప్రవీణ్ అంటే.. ఫైమా గుర్తుకు వస్తుంది. ఫైమాను గత కొన్నేళ్లుగా ప్రవీణ్ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ ఇద్దరి జోడి మీద జబర్దస్త్ షోలో ఎన్నో సెటైర్లు పడుతూనే ఉంటాయి. తాజాగా ఈ నటుడి ఇంత తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ప్రవీణ్ తండ్రి కన్నుమూశారు.

గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయన వెన్నుపూసలో నీరు వచ్చిందని చెప్పిన డాక్టర్లు తీయడానికి ప్రయత్నించే లోపే ఆయన కాళ్లు చేతులు చచ్చుపడిపోయాయి. దీంతో ఆయన ఆరోగ్యంపూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిచెందడం ప్రవీణ్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా ప్రవీణ్‌ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకోకుండా ప్రవీణ్‌ను, అతడి అన్నను చదివించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి వారిని మంచి స్థాయిలో నిలబెట్టారు. కన్నకొడుకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story