పెళ్లికి రెడీ అయిపోయిన జబర్దస్త్ కమెడియన్... సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

jabardasth
x
jabardasth
Highlights

దుర్గారావు ముందుగా ఓ కెమరా అసిస్టెంట్ గా వచ్చాడు. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు హాస్యనటుడు

జబర్దస్త్ షో ద్వారా చాలా మంది కమెడియన్లు చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. తమదైన స్టైల్ లో ప్రేక్షకులను నవ్విస్తూ ఆకట్టుకుంటున్నారు. అందులో దుర్గారావు ఒకడు . నత్తి పాత్రలను చేస్తూ అదే తన మ్యానరిజంగా మార్చుకొని నవ్విస్తున్నాడు. పలానా టీంలోనే దుర్గారావు కనిపిస్తాడని ఏమి లేదు. మొదట్లో పటాస్ ప్రకాష్ స్కిట్లో ఎక్కువగా కనిపించినప్పటికీ ఆ తర్వాత అందరి స్కిట్ లో కనిపిస్తూ వస్తున్నాడు ..

దుర్గారావు ముందుగా ఓ కెమరా అసిస్టెంట్ గా జబర్దస్త్ కి వచ్చాడు.. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ నుంచి కమెడియన్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడీ హాస్యనటుడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాజాగా దుర్గారావు నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దుర్గారావు నిశ్చితార్థ వేడుకకి చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్ట్ లు హాజరయ్యారు. మొత్తానికి దుర్గారావు ఓ ఇంటివాడు కాబోతున్నాడని సంతోషపడుతున్నారు తోటి టీం సభ్యులు..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories