Jabardasth Avinash: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ముక్కు అవినాష్

* మొత్తానికి ఒక ఇంటివాడైన ముక్కు అవినాష్

admin1
Updated on: 1 Sept 2021 6:08 PM IST
Jabardasth Comedian Avinash Going to Marry Soon And He Shares His Engagement Photos in Social Media
X

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ముక్కు అవినాష్ (ఇంస్టాగ్రామ్ ఫోటో)

Jabardasth Avinash: జబర్దస్త్ లో ముక్కు అవినాష్ గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 లో దాదాపు ఫైనల్స్ వరకు వెళ్లి వచ్చాడు. అప్పటినుంచి బిగ్ బాస్ అవినాష్ గా పేరు తెచ్చుకున్న ఈ హాస్య నటుడు ఈ మధ్యనే ఒక ఇంటివాడయ్యాడు. అనూజ అనే అమ్మాయితో ఈ మధ్యనే అవినాష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ అవినాష్ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో తన నిశ్చితార్థం విషయం గురించి అభిమానులతో పంచుకున్నారు.

అనుజ అవినాష్.. ఎంగేజ్డ్.. సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. మా కుటుంబాలు కలిశాయి. మేము కూడా కలిశాము. సింపుల్ గా మా ఎంగేజ్మెంట్ జరిగింది. మీ అందరూ పెళ్లి ఎప్పుడు అని నన్ను చాలా సార్లు అడిగారు. అతి త్వరలో, నా అనూజ తో. -మీ ముక్కు అవినాష్. సారి మీ అనూజా అవినాష్" అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు అవినాష్. అభిమానులతో పాటు పలు సెలబ్రిటీలు శ్రీముఖి, మెహబూబ్, నోయెల్ తదితరులు అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

admin1

admin1

Next Story