డీలా పడ్డా 'జాను' మూవీ కలెక్షన్స్

డీలా పడ్డా జాను మూవీ కలెక్షన్స్
x
Highlights

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం 'జాను'... తమిళ్ లో మంచి హిట్ అయిన '96' సినిమాకి ఇది రీమేక్ ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై...

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం 'జాను'... తమిళ్ లో మంచి హిట్ అయిన '96' సినిమాకి ఇది రీమేక్ ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. . ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 96 సినిమాలోని ఫీల్ ని రీక్రియేట్ చేసారని అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ఇక సమంత, శర్వానంద్ లు తమ నటనతో మెప్పించి సినిమాకే హైలెట్ గా నిలిచారు. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మొదటి 3 రోజులు కలెక్షన్లు పర్వాలేదనిపించిన ఈ చిత్రం 4 వ రోజు నుండీ మాత్రం దారుణంగా పడిపోయాయి. దీనితో ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి :

నైజాం 2.68 cr

సీడెడ్ 0.84 cr

ఉత్తరాంధ్ర 1.12 cr

ఈస్ట్ 0.45 cr

వెస్ట్ 0.34 cr

కృష్ణా 0.46 cr

గుంటూరు 0.56 cr

నెల్లూరు 0.21 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42 cr

ఓవర్సీస్ 0.84 cr

వరల్డ్ వైడ్ టోటల్ 7.92 cr (share)

'96' సినిమాకి ఇది రీమేక్ కావడంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో ఈ సినిమాకి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.92 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా 13.08 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమాకి అనుకున్నంత కలెక్షన్స్ వస్తాయా రావా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories