Vakeel Saab: తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన నటి అంజలి

Ive Not Tested Positive for COVID-19 Says Anjali
x

Vakeel Saab: తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించిన నటి అంజలి

Highlights

Vakeel Saab: వకీల్ సాబ్ హీరోయిన్ నివేతా థామస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Vakeel Saab: వకీల్ సాబ్ హీరోయిన్ నివేతా థామస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తాజాగా నటి అంజలికి కూడా కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్ లో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

తనపై వస్తున్న రూమర్స్ పై నటి అంజలి స్పందించారు. కరోనా పాజిటివ్ వచ్చినట్టు కొంతమంది అనవసరమైన రూమర్స్ ప్రచారం చేస్తున్నట్టు అంజలి తెలిపారు. తనకు కరోనా సోకలేదని తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. ఫ్యాన్స్ ఎవరూ రూమర్స్ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా అంజలి నివేతా థామస్ లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా రేపు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories