ఎట్టకేలకు ఆస్కార్ బరిలో RRR మూవీ.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్

RRR Movie Oscar Journey: ఎట్టకేలకు అభిమానులకు త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ నుండి గుడ్ న్యూస్ వచ్చింది.

Arun Chilukuri
Published on: 6 Oct 2022 2:10 PM IST
Its Official SS Rajamoulis RRR Movie Oscar Journey Begins
X

ఎట్టకేలకు ఆస్కార్ బరిలో RRR మూవీ.. అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్

RRR Movie Oscar Journey: ఎట్టకేలకు అభిమానులకు త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ నుండి గుడ్ న్యూస్ వచ్చింది. ఆర్ఆర్ఆర్‌ను అధికారికంగా ఆస్కార్ బరిలో నిలిపినట్టు మూవీ టీం ప్రకటించింది. ఆర్ఆర్ఆర్' సినిమాను నేరుగా ఆస్కార్ నామినేషన్స్‌కు పంపే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్ర బృందం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో తొలి అడుగు సైతం ఇప్పుడే పడింది. తాజాగా ఫర్ యువర్ కన్సిడరేషన్‌ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొన్ని థియేటర్లలో ఆడిన సినిమాలను ఆస్కార్స్‌కు కన్సిడర్ చేయడానికి పంపమని చెబుతోంది. అందులో భాగంగా ఈ క్యాంపెయిన్ మొదలైంది.

ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు , ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంగీత దర్శకుడుతో పాటు సౌండ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్... ఇలా పదిహేను విభాగాల్లో 'ఆర్ఆర్ఆర్'ను కన్సిడర్ చేయాలంటూ క్యాంపెయిన్ మొదలైంది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్ క్యాంపెయిన్ స్టార్ట్ కావడంతో రాజమౌళి కుమారుడు చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రేక్షకులందరి అంతులేని ప్రేమతో పాటు మా నటీనటులు, సాంకేతిక నిపుణులు చెమట ధారపోసి, ప్రేమతో చేసిన పని మమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చిందని కార్తీకేయ పేర్కొన్నారు. తమకు అంతా మంచి జరగాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు.. త్రిబుల్ ఆర్ ఫర్ ఆస్కార్ క్యాపెయిన్ మొదలైన నేపథ్యంలో హాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ రుస్ ఫిషర్ ఒక ట్వీట్ చేశారు. బెస్ట్ పిక్చర్ నామినీలను స్టేజి మీద నిలబెట్టి చివరి వరకు ఎవరైతే నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తారో... వాళ్లకు ఆస్కార్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. ఆ ఐడియా నచ్చిందని కార్తికేయ సరదాగా పేర్కొన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story