వారణాసి లో ఇస్మార్ట్ శంకర్

వారణాసి లో ఇస్మార్ట్ శంకర్
x
Highlights

ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాతో మరొక ఫ్లాప్ ను అందుకున్న యువ హీరో రామ్ తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్...

ఈ మధ్యనే 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాతో మరొక ఫ్లాప్ ను అందుకున్న యువ హీరో రామ్ తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక నెల నుండి చిత్రబృందం కొన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్ జరుపుతోంది. తాజా సమాచారం ప్రకారం గోవా షెడ్యూల్ త్వరలోనే పూర్తి కాబోతోంది. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం హైదరాబాద్ తిరిగిరానుంది.

ఇక్కడ ఒక ఫోక్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది. ఇటు హైదరాబాద్ లో షూటింగ్ అయిపోయిన వెంటనే 'ఇస్మార్ట్ శంకర్' చిత్ర బృందం వారణాసి వెళ్లనుంది. అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఒక మేజర్ షెడ్యూల్ జరగనుంది. ఇక్కడ కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.వారణాసి లో ఇస్మార్ట్ శంకర్

Show Full Article
Print Article
Next Story
More Stories