వీరసింహారెడ్డి రిజల్ట్ అనిల్ రావిపూడి కి ప్లస్ అయిందా?

* అనిల్ రావిపూడి సినిమా పై ఫోకస్ చేస్తున్న బాలయ్య ఫ్యాన్స్

Dhatripriya
Updated on: 26 Jan 2023 7:30 PM IST
Is Veerasimha Reddy result a plus for Anil Ravipudi
X

వీరసింహారెడ్డి రిజల్ట్ అనిల్ రావిపూడి కి ప్లస్ అయిందా?

Veera Simha Reddy: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ బాలకృష్ణ తన అదిరిపోయే పర్ఫామెన్స్ మరియు డైలాగ్ డెలివరీతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే "అఖండ" సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి కానీ గోపీచంద్ ఆ అంచనాలను అందుకోలేకపోయారు అని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు దృష్టి మొత్తం బాలకృష్ణ తదుపరి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి పై పడింది. అయితే అనిల్ రావిపూడి అఖండ రేంజిలో హిట్ అందుకోలేక పోయినప్పటికీ కనీసం విరసింహారెడ్డి సినిమా కంటే బాగుండే సినిమా తీస్తే సరిపోతుంది. మరోవైపు తాను చేసే హీరోలలోని స్ట్రెంత్ అనిల్ రావిపూడి కి చాలా బాగా తెలుసు. వాటికి తగ్గట్టుగానే తన సినిమాలోని కథను పాత్రలను మరియు సన్నివేశాలను రాసుకుంటాడు అనిల్ రావిపూడి.

ఈ నేపథ్యంలో వీర సింహారెడ్డి సినిమా ఆవరేజ్ గా ఆడటం అనిల్ రావిపూడి కి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు కూడా సూపర్ హిట్లతో నిండి ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్యతో తీయబోయే సినిమాతో కూడా అనిల్ రావిపూడి ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story