Balakrishna: బాలయ్య ఆ సినిమా చేయకపోవడానికి కారణం ఇదేనా?

Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో గొప్ప చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోతాయి.

admin1
Published on: 16 Aug 2021 6:56 PM IST
Is This the Reason why Balakrishna did not Make That Film?
X

Balakrishna: బాలయ్య ఆ సినిమా చేయకపోవడానికి కారణం ఇదేనా?

Balakrishna: సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో గొప్ప చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోతాయి. రాముడిగా అయినా, కృష్ణుడిగా అయినా, ఆఖరికి రావనాసురుడుగా అయినా ఎన్టీఆర్ ని మించి నటించేవారు ఇండస్ట్రీ లోనే లేరు. అయితే ఎన్నో విభిన్న మైన పాత్రలలో కనిపించిన ఎన్టీఆర్ చేయలేకపోయిన పాత్ర జెంగిస్ ఖాన్ పాత్ర. అయితే ఆ పాత్రలో నటించే అవకాశం కూడా ఎన్టీఆర్ కి వచ్చింది. నిర్మాత కాకర్ల కృష్ణ జెంగిస్ ఖాన్ కథ మీద సినిమా తీసేందుకు ఎన్టీఆర్ ని సంప్రదించారు. దాసరి నారాయణ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలి. ఎన్టీఆర్ ఒప్పుకున్నారు కూడా. కాకర్ల కృష్ణ స్క్రిప్ట్ సైతం పూర్తి చేసారు.

కానీ ఆ సినిమా పట్టాలెక్కెలోపు ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ అయిపోయారు. సినిమా కూడా అటకెక్కింది. ఆ తర్వాత నిర్మాతలు బాలకృష్ణ ని అడిగారు కానీ ఆ చిత్రం కూడా పట్టాలెక్కలేదు. కానీ బాలకృష్ణ మాత్రం జెంగిస్ ఖాన్ సినిమా చేసి తన తండ్రి గారి కోరిక తీర్చాలని అనుకున్నారు. కానీ అలాంటి స్క్రిప్ట్ చేయడానికి ధైర్యం చేయలేదు. అయితే బయోపిక్ తీయడానికి జెంగిస్ ఖాన్ మంచి వ్యక్తి కాదు. అతని మీద ప్రజలకు మంచి అభిప్రాయమూ లేదు. అందరి దృష్టిలో జెంగిస్ ఖాన్ ఒక కిరాతకమైన హంతకుడు మాత్రమే. అందుకే అటువంటి వ్యక్తిపై సినిమా తీయడం వివాదాస్పదంగా మారుతుందని బాలకృష్ణ భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా మొదలవుతుందో లేదో మాత్రం ఇప్పుడే చెప్పలేం.

admin1

admin1

Next Story