రామ్ చరణ్ ను కిరణ్ అబ్బవరం కలవడం వెనుక కారణం ఇదేనా?

Ram Charan: రామ్ చరణ్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పిన యువ హీరో

Dhatripriya
Published on: 26 March 2023 3:42 PM IST
Is This Reason Behind Kiran Abbavaram Meeting Ram Charan
X

రామ్ చరణ్ ను కిరణ్ అబ్బవరం కలవడం వెనుక కారణం ఇదేనా?

Ram Charan: ఈ మధ్యనే "వినరో భాగ్యం విష్ణు కథ" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఇప్పుడు "మీటర్" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా "మీటర్" అనే సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోస్టర్లు కూడా దర్శక నిర్మాతలు విడుదల చేశారు. అందులో కిరణ్ అబ్బవరం తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపించారు. వివరాల్లోకి వెళితే కిరణ్ అబ్బవరం ఈ మధ్యనే "నాటు నాటు" పాటకి ఆస్కార్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి రామ్ చరణ్ ను కలిశారని తెలుస్తోంది. అంతేకాకుండా కిరణ్ రామ్ చరణ్ కి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారట. ఇక మీటర్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా చూపించగా రామ్ చరణ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది.

ఇక త్వరలోనే సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో కూడా విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. రమేష్ కాడూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో బాగానే అలరిస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో ఎంతవరకు ప్రేక్షకులను అలరించనున్నారో వేచి చూడాలి. వరుస హిట్ సినిమాలతో కిరణ్ క్రేజ్ కూడా బాగానే పెరుగుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story