రామ్ చరణ్ ముంబై వెళ్లింది అందుకేనా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి ముంబై లోనే ఉంటున్నారు.

admin1
Updated on: 9 Feb 2022 2:16 PM IST
Is that why Ram Charan flew to Mumbai?
X

రామ్ చరణ్ ముంబై వెళ్లింది అందుకేనా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి ముంబై లోనే ఉంటున్నారు. జనవరి 30న తన సోదరి శ్రీజ కొణిదల తో ముంబైలో ఎయిర్పోర్ట్ లో ప్రత్యక్షమైన రామ్ చరణ్ ఇంకా ముంబై లోనే ఉన్నారు. కానీ రామ్ చరణ్ ఇన్ని రోజులు గా ముంబైలో ఉండటానికి గల కారణం ఏంటి అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ ముంబైకి వచ్చింది సినిమాల గురించి కాదని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అని తెలుస్తోంది. తన కుటుంబానికి సంబంధించిన ఒక విషయమై చెర్రీ ఇన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్నారట.

ఇక అతి త్వరలోనే ఆ పని పూర్తి చేసుకొని చరణ్ మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి రానున్నారు. ముంబై లో రామ్ చరణ్ పని పూర్తయిన తర్వాత శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలు కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్న ఈ సినిమా ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story