Prabhas: ప్రభాస్ ముంబై కి అందుకే వెళ్ళారా?

Prabhas: *ముంబై వెళ్ళిన ప్రభాస్.. కారణం అదేనా?

Sriveni Erugu
Published on: 16 Jun 2022 12:27 PM IST
Is that why Prabhas went to Mumbai?
X

Prabhas: ప్రభాస్ ముంబై కి అందుకే వెళ్ళారా?

Prabhas: ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో ఒక అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న "ప్రాజెక్ట్ కే" కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. మరోవైపు కే జి ఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమా షూటింగ్ కూడా జరుగుతూనే ఉంది. ఇలా రెండు సినిమాల షూటింగులతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు ప్రభాస్. మరోవైపు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా విషయాలు కూడా తెలుసుకుంటున్నారు ప్రభాస్.

సినిమా అవుట్ పుట్ ఎంతవరకు వచ్చిందని మరియు ఇతర విషయాల గురించి ఎప్పటికప్పుడు ప్రభాస్ ఓం రౌత్ తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు కొత్త బ్రాండ్ లకు సాయం చేయడం కోసం ప్రభాస్ ముంబై వెళ్లారు అని తెలుస్తోంది. ఇక్కడే ప్రభాస్ మరొక బాలీవుడ్ ప్రాజెక్టుని సైన్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో రాధేశ్యామ్ సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే "ఆది పురుష్" షూటింగ్ పూర్తి అయిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనుల తో చిత్ర బృందం బిజీగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story