Trisha Krishnan: త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోయే కారణమా..?

Trisha Krishnan: త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోయే కారణమా..?

Arun Chilukuri
Published on: 25 April 2023 2:21 PM IST
Is That Hero the Reason for Trisha Krishnan not Getting Married?
X

Trisha Krishnan: త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోయే కారణమా..?

Trisha Krishnan: పొనియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ లో భాగంగా మూవీ నటీనటులు కార్తి, విక్రమ్, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ఇలా కాస్ట్ అండ్ క్రూ హైదరాబాద్ లో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ ఉన్నా కూడా అందరి చూపు మాత్రం త్రిష పైనే లాక్ అయింది. పీఎస్ 2 ఈవెంట్ లో ఈ చెన్నై సోయగం రాయల్ లుక్ లో మహారాణిలా కనిపించింది. బ్లాక్ కలర్ శారీలో ఉన్న త్రిషను చూసి కుర్రకారు ఫిదా అయింది. త్రిష లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. వయసు పెరుగుతున్న కొద్దీ త్రిషలో అందం మరింత పెరుగుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నెటిజన్స్ కామెంట్స్ కి తగ్గట్టే పీఎస్ 2 ప్రమోషనల్ ఈవెంట్ లో త్రిష సింపుల్ బట్ ఎలిగెంట్ గా త్రిష లుక్ అదిరిపోయింది. డార్లింగ్ ప్రభాస్ వర్షం మూవీలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే చెక్కుచెదరని అందంతో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేయడం విశేషం. త్రిష గ్లామర్ ని చూసి కొంతమంది మంత్రముగ్థులౌతుంటే మరికొందరు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిష ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ మరికొందరు ఆరా తీస్తున్నారు. అయితే సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా త్రిష ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలిచింది.

ప్రభాస్, మహేష్ బాబు, శింబు, రానా, విజయ్ వంటి స్టార్ హీరోలతో త్రిష ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ బిజినెస్ మెన్ వరుణ్ మానియన్ తో ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆ ఎంగేజ్ మెంట్ ను త్రిష క్యాన్సిల్ చేసుకుంది. ఎంగేజ్ మెంట్ ఇలా అర్థాంతరంగా క్యాన్సల్ కావడానికి హీరో ధనుష్ కారణమని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. తనకు కాబోయే భర్తకు విభేదాలు ఉన్నాయని తెలిసి కూడా థనుష్ ను త్రిష ఎంగేజ్ మెంట్ కి ఆహ్వానించింది. ఈ విషయమే ఇరువురు మధ్య గొడవకు దారి తీయగా త్రిష ఎంగేజ్ మెంట్ ని క్యాన్సిల్ చేసుకుందని వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత త్రిష పెళ్లికి దూరమయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story