Samantha: సమంత గుర్రపు స్వారీ ఈ సినిమా కోసమా లేక ఆరోగ్యం కోసమా?

Samantha: సినిమా కోసం చేసిన ఆరోగ్యానికి కూడా మంచిదే అంటున్న సమంత ఫ్యాన్స్

Jyothi
Published on: 27 Feb 2023 10:17 AM IST
Is Samantha Horse Riding for this Movie or for Health?
X

Samantha: సమంత గుర్రపు స్వారీ ఈ సినిమా కోసమా లేక ఆరోగ్యం కోసమా?

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఎంత పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్ అని అందరికీ తెలిసిందే. అసలు సమంత సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దాదాపు అన్ని ఫోటోలు ఆమె వర్కౌట్ ఫోటోలు లేదా వీడియోలే ఉంటాయి. అయితే తాజాగా ఇప్పుడు సమంత గుర్రం ఎక్కి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తే సమంత హార్స్ రైడింగ్ క్లాసెస్ నేర్చుకుంటుంది అని అర్థమవుతుంది.

కానీ మరోవైపు సమంత ఆరోగ్య పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఒకవైపు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ, ప్రతి నెల ఐవీ ఫ్లూయిడ్ ఎక్కించుకుంటూ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా సమంత ఈ పరిస్థితుల్లో ఎందుకు గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి సినిమా కోసం మాత్రమే కాకపోయినా గుర్రపు స్వారీ నేర్చుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.

అందుకే సమంత తన ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా గుర్రపు స్వారీ ఉపయోగపడుతుందని నేర్చుకుంటుంది అని కొందరు చెబుతున్నారు. ఇక నేను మొన్నటిదాకా సినిమాలకి దూరంగా ఉంటున్న సమంత ఇప్పుడు మళ్ళీ వరుస షూటింగ్ లతో బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన "సిటాడెల్" అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత మార్చ్ మొదటి వారం నుంచి విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న "ఖుషీ" సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా నటించిన "శాకుంతలం" సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Jyothi

Jyothi

Next Story