సమంత భావోద్వేగం వెనుక ఉన్న ఆఫ్ స్క్రీన్ కష్టాలు.. అందమైన చిరునవ్వు వెనుకున్న అంతులేని వ్యధ..

Is Samantha Facing Hardships Off Screen
x

సమంత భావోద్వేగం వెనుక ఉన్న ఆఫ్ స్క్రీన్ కష్టాలు.. అందమైన చిరునవ్వు వెనుకున్న అంతులేని వ్యధ..

Highlights

Samantha: తారల జీవితాలు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించినంత కలర్‌ఫుల్‌గా మాత్రం రియల్‌ లైఫ్‌లో ఉండవు.

Samantha: తారల జీవితాలు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించినంత కలర్‌ఫుల్‌గా మాత్రం రియల్‌ లైఫ్‌లో ఉండవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత.! మహానటిలో సావిత్రి జీవితంపై కథ రాసే పాత్రలో ఒదిగిపోయిన సామ్‌ నిజజీవిత కథ కూడా సాధారణమైందేం కాదు. తాజాగా యశోద ప్రమోషన్స్‌లో శామ్ ఎమోషనల్‌ అయింది. పైకి కనిపించే తన అందమయిన చిరునవ్వు వెనుక ఇంత వ్యధ ఉందా? అనిపించేలా ఉబికివచ్చిన దుఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ కన్నీళ్లను దిగమింగుకుని నెవర్ గివ్ అప్‌ అంటూ అభిమానులకు భావోద్వేగ సందేశాన్నిస్తోంది. ఇంతకూ, సామ్ కన్నీటి వెనుక ఉన్న ఆఫ్ స్క్రీన్ కష్టాలేంటి? ఒక్క అడుగు ముందుకు వేస్తానో లేదో అనే పరిస్థితులు సమంతకు ఎలా వచ్చాయి?

సినిమా అన్నా అందులో తళుక్కున మెరిసే తారలన్నా అందరికీ సింపుల్‌ భావనే ఉంటుంది. సినీ తారలంటే కష్టాలు, కన్నీళ్లు ఆన్ స్క్రీన్‌మీదే కానీ.. ఆఫ్ స్క్రీన్‌కు వచ్చేసరికి సకలసౌఖ్యాలతో ఎనీటైం హ్యాపీగా ఉంటారనే భావనే అందరిలోనూ కనిపిస్తుంది. కానీ, వాస్తవం మాత్రం అది కాదు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా.. ఎన్ని లక్షల అభిమానుల ఫాలోయింగ్ ఉన్నా, కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో ఉన్నా, నిత్య జీవితంలో సగటు మనిషికి ఉండే కష్టాలు వారికీ ఉంటాయి. అంతేకాదు, సామాన్యులతో పోల్చుకుంటే ఆ కష్టాలు, కన్నీళ్లు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి తప్ప ఊహించినంత ఈజీగా వాళ్ల లైఫ్ ఉండదు. అన్నింటికీ మించి మోస్ట్ ఇంపార్టెంట్‌ థింగ్ ఫ్రీడమ్.! సామాన్యులకు ఉండే స్వేచ్ఛ సెలబ్రిటీల దరిదాపుల్లో కనిపించదు. వాళ్లకూ ఓ పర్సనల్‌ లైఫ్ ఉంటుందని ప్రపంచం ఎప్పుడో మర్చిపోయింది. పొరపాటున ఎక్కడైనా కనిపిస్తే సెల్ఫీలంటూ, ఆటోగ్రాఫులంటూ ఎగబడిపోవడమే తప్ప వాళ్ల స్వేచ్ఛను హరిస్తున్నామన్న పచ్చి నిజాన్ని మనమంతా ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడిదంతా చెప్పడానికి కారణం సమంత. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత అంతరంగం చాలా ప్రశ్నలు అడుగుతోంది. ఇప్పుడా ప్రశ్నలకు జవాబెవరిస్తారు?

ఏమాయ చేసావే అంటూ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైన సమంతకు స్టార్‌డమ్‌ కూడా అంతే వేగంగా వచ్చింది. ఒకదాన్ని మించిన మరొక హిట్ పిక్చర్‌తో టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడానే లేకుండా అభిమానుల మనసులు గెలుచుకుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో నటనకు హాట్సాఫ్‌ చెప్పని సినిమా అభిమాని ఉండరేమో అనేంతగా నటనలో ఒదిగిపోయింది.

కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అక్కినేని ఇంటికి కోడలైంది. సామ్ జీవితంలో అద్భుతమైన క్షణాలు బహుశా అవే కావొచ్చు. కానీ, ఎప్పుడూ ఒకేలా సాగిపోతే అది జీవితం ఎందుకవుతుంది? వాళ్లిద్దరి మధ్యా ఏం జరిగిందో ఏమో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇద్దరూ ఏకాభిప్రాయంతోనే ఎవరికి వారయ్యారు. కానీ, కాలం మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై సామ్ పండించిన కష్టాలకు మించిన పరీక్షలే పెడుతూ వచ్చింది, వస్తోంది కూడా. ఆఫ్టర్ డివోర్స్ సమంత జీవితం అనుకున్నంత సాఫీగా సాగలేదు. సోషల్ మీడియా వేదికగా పిచ్చి కూతలు కూసే పనీపాటా లేని వారి దగ్గర నుంచి అభిప్రాయాల పేరుతో ఇష్టం వచ్చినట్టు మనసును నొప్పించే ఘటనలూ చాలానే ఎదురయ్యాయి. సమంత గుండె నిబ్బరం ఉన్న మహిళ కాబట్టి ఆ కన్నీళ్లను దాటుకుని అడుగు ముందుకేసింది. కానీ, ఇది జీవితం ఏదీ అప్పటితో, అక్కడితో ఆగిపోదు. పరీక్షల మీద పరీక్షలు పెడుతూనే ఉంటుంది.

సమంత మళ్లీ ఫైట్ బ్యాక్ చేయడం మొదలు పెట్టింది. వరుస సినిమాలు చేస్తూ కష్టంలోనే సంతోషాన్ని వెతుక్కొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఊహించని మరో కష్టం వచ్చిపడింది. ఈసారి మయోసైటిస్ రూపంలో సామ్‌కు అతిపెద్ద పరీక్ష ఎదురైంది. ఇదేం సాధారణ వ్యాధి కాదు. ఆటో ఇమ్యూన్‌ సమస్య కారణంగా వస్తుంది. దీని వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది. కూర్చుంటే పైకి లేవలేరు. కళ్లు ఉబ్బుతాయి. ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా మారిపోతుంది. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోక పోతే ఈ వ్యాధి మరణం వరకూ తీసుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు సమంతకు ఎదురైన విషమ పరీక్ష ఇదే. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక్కడ మొదలు కో యాక్టర్స్ దగ్గర నుంచి అభిమానుల వరకూ అందరూ సామ్ కోలుకోవాలని ప్రార్ధించడం మొదలు పెట్టారు. గెట్ వెల్‌ సూన్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండిగ్‌లో ఉంది. అందరూ పాజిటివ్‌గా రియాక్టయితే సమస్యేముంది? అసలు ఇబ్బందులు ఇక్కడే మొదలయ్యాయి.

మయోసైటిస్ గురించి సామ్ ఇలా పోస్ట్ పెట్టిందో లేదో.. పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెళ్లు దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఇష్టారీతిన రెచ్చిపోయాయి. వ్యాధి లక్షణాలు మొదలుకొని ఆమె పరిస్థితి చేయిదాటిపోయింది అంటూ లైకులు వ్యూస్ పిచ్చితో ఇష్టారీతిన పిచ్చి రాతలు రాశాయి. ఇదే అంశం సమంతకు కన్నీరు తెప్పించింది. ఎప్పుడు తన ఫోన్ అన్‌లాక్ చేసినా అవే నోటిఫికేషన్స్‌ కనిపించడం ధైర్యంగా పోరాడాల్సిన సమంతను కుంగదీశాయి. నెవర్ గివ్ అప్‌ అన్న మాటను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునే సమంత.. యశోద ప్రమోషన్స్‌లో ఎమోషనల్ అయిపోయింది.

"ఒక్కోసారి అడుగు ముందుకేయగలనా అనిపిస్తుంది.. ఇంకోసారి ఇక్కడివరకూ ఎలా వచ్చానో అనిపిస్తోంది. తన కెరీర్‌, పర్సనల్ లైఫ్‌ను సింగిల్‌ లైన్‌లో ఆవిష్కరించిన అంతరంగమే ఇది. కానీ, ఆ పరిస్థితులను అనుభవించిన ఆమె ఎన్ని కన్నీళ్లను దిగమింగి ఉంటుంది.? రియల్ లైఫ్‌లో ఫైటర్‌గా కనిపించే సామ్‌ నుంచి ఇలాంటి ఓ భావోద్వేగాన్ని ఊహించగలమా? ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సమంత కళ్ల నుండి కన్నీళ్లు ఉబికివచ్చాయంటే ఆమె ఎంత మదన పడి ఉంటుంది? కానీ, ఇలాంటి సమయంలోనూ తాను పోరాడుతా అని ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతోందంటే అది ఆమెకున్న ధైర్యమే. ఇంతటి భావోద్వేగ క్షణాల్లోనూ తానింకా మరణించలేదని.. అలాంటి హెడ్‌లైన్స్‌ అప్పుడే అవసరం లేదంటూ చిరునవ్వుతో చెప్పిన ఆమె మాట పిచ్చి రాతలు రాసేవారికి చెప్పుదెబ్బ కాక మరేంటి?

సామ్ ఎంత స్ట్రాంగ్ మహిళో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కానీ, మయోసైటిస్ లాంటి సమస్య తనకుందని తెలిసినా, దానికి సంబంధించిన ఇబ్బందులను ఫేస్ చేస్తున్నా.. ఆమె చూపిన తెగువ, పోరాటం మాత్రం అసాధారణం. అందుకే ఆమె సమంత అయింది. యశోద మూవీలో యాక్షన్‌ సన్నివేశాల్లో ఆమె ఎక్కడా తగ్గలేదు. తనలోని రియల్ ఫైటర్‌ను బయటకు తీసింది. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేసేస్తోంది. మయోసైటిస్‌ కండరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి అయినప్పటికీ తనదైన డెడికేషన్‌తో యాక్షన్‌ సన్నివేశాల్లో మెప్పించింది. యశోద చిత్రానికి యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన యానిక్‌ బెన్‌.. తాజా వీడియోలో సెభాష్ సామ్ అని మెచ్చుకున్నారు.

పోరాడేవాళ్లకే పరీక్షలన్నీ అన్న మాట సమంతకు అక్షరాలా యాప్ట్ అవుతుందేమో.! అందుకే, ఎప్పుడూ చిరునవ్వుతో సింపుల్‌గా కనిపించే సామ్‌ ఎన్ని పరీక్షలనయినా చిరునవ్వుతోనే ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. జీవితంలో ఎన్నో కష్టాలను అదే చిరునవ్వుతో అధిగమించిన సామ్‌కు మయోసైటిస్‌ను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌ ఏమాత్రం కాదు. ఎలాంటి సమస్యతో అయినా ఫైట్ చేస్తానని ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న సామ్‌ త్వరలోనే మయోసైటిస్‌ నుంచి కూడా బయటపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories