Samantha: సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ..?

Samantha: గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 26 Oct 2022 3:10 PM IST
Is Samantha Ruth Prabhu Did Plastic Surgery on her Face
X

Samantha: సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ..?

Samantha: గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం బాగోలేదని అందుకే ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్ళిందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సమంత పెట్టిన పోస్టు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సమంత లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఫోటోలను చూసి అభిమానులు షాకవుతున్నారు. అభిమానులు గుర్తు పట్టలేని విధంగా సమంత ఈ ఫోటోలలో ఉండటం గమనార్హం.

ఆమె తాజాగా చేసిన యాడ్, అందులోని ఫోటోలను గమనిస్తే సమంత మొహంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సదరు ప్రకటనలో సామ్‌ డిఫరెంట్‌గా కనిపించడం చూసి ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఏంటీ సామ్‌ ఇలా మారిపోయింది! సర్జరీ చేసుకుందా?' అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటుంది. హాస్టారికల్‌ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న శాకుంతలం షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడమే కాదు డబ్బింగ్‌ వర్క్‌ను కూడా జరుపుకుంటోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story