'మా' నుంచి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తారా?

మా నుంచి రాజశేఖర్ ను సస్పెండ్ చేస్తారా?
x
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. సాధారణంగా కోపాన్ని ప్రదర్శించని చిరంజీవి...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణలో హీరో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. సాధారణంగా కోపాన్ని ప్రదర్శించని చిరంజీవి వేదికపైనే రాజశేఖర్ పట్ల కోపంగా మాట్లాడారు. రాజశేఖర్ పెద్దల పట్ల అనుసరించిన వైఖరి సరికాదని ఖండించిన చిరంజీవి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసలు రాజశేఖర్ కావాలనే సమావేశంలో రచ్చ చేశారని పలువురు భావిస్తున్నారు.

గతంలోనూ వివాదాల్ని సృష్టించడం అలవాటుగా మారిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, 'మా' వ్యవస్థాపకు అధ్యక్షడు చిరంజీవి మాట్లాడుతుంటే.. పదే పదే అడ్డుపడటం, మైక్ లాక్కోవడమే కాకుండా ఇండస్ట్రీ పెద్దలతో గౌరవం లేకుండా అమర్యాదగా మాట్లాడిన రాజశేఖర్‌పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే హీరో రాజశేఖర్ తీరుపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళిక ప్రకారం వచ్చిన రాజశేఖర్‌పై 'మా' క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చిరంజీవి. మా ఫౌండర్‌గా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి ఈ ఇష్యూపై చాలా సీరియస్‌గా ఉండటంతో రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే మా అధ్యక్షుడు నరేష్ స్పాట్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. మా గురించి మీడియా ముందు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పాట్ కమిటీకి తెలియజేయవచ్చునన్నారు నరేష్.

మొత్తమ్మీద మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రాజశేఖర్ కారణంగా పూర్తీ స్థాయిలో రచ్చగా మారిపోయింది. ఇంతకు ముందు కూడా మా సమావేశంలో రాజశేఖర్ ప్రవర్తనపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దానిని మా ఇంటి గొడవ అంటూ సర్ది చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు వంటి సీనియర్ నటులను అవమాన పరిచేలా రాజశేఖర్ వ్యవహరించడం.. విషయాన్ని మా వ్యవస్థాపకుడు చిరంజీవి సీరియస్ గా తీసుకోవడం తో ఈసారి రాజశేఖర్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందనీ, మా నుంచి ఆయనను సస్పెండ్ చేయవచ్చనీ సినీ వర్గాలు అనుకుంటున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories